అనుపమ 'లాక్‌డౌన్‌' టీజర్‌ విడుదల | Anupama Parameswaran Lockdown Movie Official Teaser Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అనుపమ 'లాక్‌డౌన్‌' టీజర్‌ విడుదల

Jun 9 2024 1:10 PM | Updated on Jun 9 2024 4:29 PM

Lockdown Movie Teaser Out Now

టాలీవుడ్‌లో 'టిల్లు స్వేర్‌' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. ఈ చిత్రంలో స్క్రీన్‌పై  హాట్‌గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్‌ను తెరపై చూపించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల బాటలో అనుపమ దూసుకురానుంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌,పరదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా అనుపమ పరమేశ్వరన్‌ నటించిన లాక్‌డౌన్‌ చిత్రం నుంచి టీజర్‌ విడుదలైంది. అయితే, తమిళ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి ఏ.ఆర్‌.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశంతో సరికొత్తగా ఉండే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

ప్రస్తుతం విడుదలైన లాక్‌డౌన్‌ టీజర్‌ నిమిషంలోపే ఉన్నప్పటికీ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. తెలుగులో పరదా అనే చిత్రంతో పాటు తమిళంలో 'బైసన్‌ కాలమాదన్‌' అనే తమిళ చిత్రంలో కూడా  అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement