థియేటర్స్‌లో 'రిపబ్లిక్‌'.. ఓటీటీలో ‘ఒరేయ్ బామ్మర్ది’

List of Upcoming Movies Release On OTT And Theatres in October First Week - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం ఈ మధ్య కాలంలో థియేటర్లలో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. చిన్న సినిమాల నుంచి బడా మూవీలు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం!


కలెక్టర్‌గా సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’
మెగా మేనల్లుడు సాయి తేజ్‌  హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.  ఇందులో కలెక్టర్‌ పంజా అభిరామ్‌ పాత్రలో నటించారు సాయితేజ్‌. 

బైక్‌ రైడర్స్‌ ఇదే మా కథ 
శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’.గురు పవన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్ల కథ ఇది. తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు ఎలా  పరిచయమవుతారు? అనుకున్న గమ్యానికి వీరు చేరుకున్నారా అన్నదే సినిమా కథ. ఈ చిత్రం అక్టోబర్‌ 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. 

ఆహాలో ‘ఒరేయ్ బామ్మర్ది’
సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ఇది వరకే రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది.  అక్టోబర్‌1 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

 

నెట్‌ఫ్లిక్స్‌

డయానా  (అక్టోబర్‌1)

 నో వన్‌ గెట్స్‌ అవుట్‌ ఎలైవ్‌ ( సెప్టెంబరు 29)

► ద గల్టీ( అక్టోబరు 1)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

 షిద్ధత్‌ -అక్టోబరు 1

► లిఫ్ట్‌- అక్టోబరు 1

అమెజాన్‌ ప్రైమ్‌

చెహ్రే (సెప్టెంబరు 30)

బింగ్‌ హెల్‌(అక్టోబరు 1)

బ్లాక్‌ ఆజ్‌ నైట్‌(అక్టోబరు 1)

జీ5

బ్రేక్‌ పాయింట్‌ (అక్టోబరు 1)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top