OTT, Theatre Releases This Week: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే

List Of Upcoming Movies And Web Series Released In September Second Week - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. గతవారం కోబ్రా మినహా అన్ని చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. వాటిలో  ఒకటి రెండు చిత్రాలు మంచి టాక్‌ని సంపాదించుకోగా..మరికొన్ని బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న చిత్రాలు అటు థియేటర్స్‌లో ఇటు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.  వాటిపై ఓ లుక్కేద్దాం.

కెప్టెన్‌
తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం కెప్టెన్‌. శక్తి సౌందన్‌ రాజన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. 

బ్రహ్మాస్త్రం
రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్‌ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ ఫోకస్, స్టార్‌లైట్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది.

ఒకే ఒక జీవితం
శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్‌ కానుంది.

శ్రీరంగాపురం
వినాయక్‌ దేశాయ్, పాయల్‌ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్‌ ముఖ్య తారాగణంగా  తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగాపురం’.ఎమ్‌ఎస్‌. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మించిన ఈ సినిమా సెస్టెంబర్‌ 9న విడుదల కానుంది. 

కొత్తకొత్తగా
అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బిజి గోవిందరాజు సమర్పణలో మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్‌9) విడుదల కానుంది. 

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

డిస్నీ+హాట్‌స్టార్‌
థోర్‌ లవ్‌ అండ్‌ థండ్‌(తెలుగు), సెప్టెంబర్‌ 8

గ్రోయింగ్‌ అప్‌(వెబ్‌ సిరీస్‌) సెప్టెంబర్‌ 8

హైడోస్‌.. సెప్టెంబర్‌ 8

పినాచో.. సెప్టెంబర్‌ 8

కార్స్‌ ఆన్‌ ది రోడ్‌(హాలీవుడ్‌).. సెప్టెబర్‌ 8

వెడ్డింగ్‌ సీజన్‌(హాలీవుడ్‌) సెప్టెంబర్‌ 8

నెట్‌ఫ్లిక్స్‌
వన్స్‌ అపాన్‌ ఏ స్మాల్‌ టౌన్‌(సిరీస్‌), సెప్టెంబర్‌ 5

రిక్‌ అండ్‌ మార్టీ:సీజన్‌-6: ఎపిసోడ్‌-1(వెబ్‌ సిరీస్‌).. సెప్టెంబర్‌ 5

అన్‌టోల్డ్‌: ది రేస్‌ ఆఫ్‌ సెంచరీ(హాలీవుడ్‌) సెప్టెంబర్‌6

ఇండియన్‌ ప్రేడేటర్‌: ది డైరీ ఆఫ్‌ ఏ సీరియల్‌ కిల్లర్‌(డాక్యమెంటరీ) సెప్టెంబర్‌ 7

చెప్స్‌ టేబుల్‌: పిజ్జా ఏ క్వైట్‌ ప్లేస్‌(డాక్యుమెంటరీ) సెప్టెంబర్‌ 7

ది అంత్రాక్స్‌ అటాక్స్‌(హాలీవుడ్‌) సెప్టెంబర్‌ 8

ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ (బాలీవుడ్‌) సెప్టెంబర్‌ 9

కోబ్రా కాయ్‌: సీజన్‌-5(వెబ్‌ సిరీస్‌) సెప్టెంబర్‌ 9

మోర్టల్‌ కాంబ్యాట్‌(హాలీవుడ్‌) సెప్టెంబర్‌ 11

అమెజాన్ ప్రైమ్
స్టూడియో 666.. సెప్టెంబర్‌ 5

హీ ఈజ్‌ సైకోమెట్రిక్- సెప్టెంబర్‌ 7

రిప్లై 1994- సెప్టెంబర్‌ 7

ప్రిజన్‌ ప్లే బుక్‌- సెప్టెంబర్‌ 7

ఎలీన్‌(Aline)-సెప్టెంబర్‌ 9 (వీటితో పాటు మరికొన్ని వెబ్‌ సిరీస్‌, టాక్‌ షోలు ఈ వారంలో స్ట్రీమింగ్‌ కానున్నాయి)

ఆహా
డ్యాన్స్‌ ఐకాన్‌(రియాల్టీ షో) సెప్టెంబర్‌ 11

జీ5
పాపన్‌(మూవీ) సెప్టెంబర్‌ 7

ఎంఎక్స్‌ ప్లేయర్‌
యునికి యారీ(బాలీవుడ్‌), సెప్టెంబర్‌ 9

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top