ట్విట్ట‌ర్ ఉన్న‌ది విషం చిమ్మ‌డానికేనా?

Laxmmi Bomb Triggers Trolls In An Outrage A Day India - Sakshi

అక్ష‌య్ కుమార్..చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న న‌టుడు. టాయిలెట్స్, ప్యాడ్, మిష‌ల్ మంగ‌ల్ వంటి సందేశాత్మ‌క చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. 2012లో ప‌రేష్ రావ‌ల్ రూపొందించిన ఓ మై గాడ్ చిత్రంలో కృష్టుడిగా న‌టించిన‌ప్ప‌డు అక్ష‌య్‌ను పొగిడిన వాళ్లే ప్ర‌స్తుతం అత‌న్ని విమ‌ర్శిస్తున్నారు. మ‌తాన్ని అప‌హాస్యం చేసేలా అక్ష‌య్ కొత్త సినిమా 'ల‌క్ష్మీబాంబ్' ఉందంటూ సినిమా విడుద‌ల‌కు ముందే వీళ్లంతా ఓ డిక్ల‌రేష‌న్ ఇచ్చేశారు. కాంచ‌న రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో  ట్రాన్‌జెండ‌ర్ పాత్ర‌లో క‌నిపించనున్న అక్ష‌య్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు విషం చిమ్ముతున్నారు. భారతీయులు అత్యంత పవిత్రంగా కొలిచే ఆరాధ్య దేవత లక్ష్మీదేవిని అక్షయ్‌.. తన తాజా చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’ పేరుతో దేవిని ఎగతాళి చేస్తున్నాడంటూ ట్విట్ట‌ర్‌లో రచ్చ చేస్తున్నారు. సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌ల‌తో ట్రెండ్ చేస్తున్నారు. (‘ఆ సినిమా లక్ష్మీదేవిని అపహాస్యం చేసేలా ఉంది’ )

ఒక‌ప్ప‌డు దేవుని పాత్ర‌లో న‌టించిన  అక్ష‌య్‌ను ఆరాధించిన  ఓ వ‌ర్గం ప్ర‌జ‌లే  ఇప్పుడు అక్ష‌య్‌ను టార్గెట్ చేశారు. ల‌వ్ జిహాదీని ప్రోత్స‌హించేలా, హిందూ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉందంటూ సినిమాపై విషం చిమ్ముతున్నారు. మొన్న‌టికి మొన్న ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్‌ తనిష్క్ రూపిందించిన లేటెస్ట్ యాడ్ విమ‌ర్శ‌ల పాలైన సంగ‌తి తెలిసిందే. ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్‌ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు  #BoycottTanishq ట్రెండ్‌ చేయడంతో ఈ యాడ్‌ను తొలగిస్తున్నట్టు యాజ‌మాన్యం ప్రకటించింది.

భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్‌ చేయడమే తమ ఏకత్వం(ఈ పేరుతోనే కొత్త కలెక్షన్‌ ప్రవేశపెట్టింది) క్యాంపెయిన్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశం’’ అని వివరణ ఇచ్చింది.  అయినా కొంద‌రు నిర‌స‌న‌కారులు మాత్రం ఈ వీడియో తొలగించినంత మాత్రాన, చేసిన తప్పు ఒప్పైపోదని, ఇకపై తనిష్క్‌ జువెలరీ కొనే ప్రసక్తే లేదంటూ మరికొంత మంది సోషల్‌ మీడియా వేదికగా తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. అంటే ఓ సినిమా కానీ యాడ్‌లో కానీ మ‌న‌కు న‌చ్చ‌ని విష‌యాలు ఉంటే చాలు  విషం చిమ్మ‌డ‌మే ప‌ని అన్న‌ట్లు కొంద‌రు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు వారి మాన‌సిక స్థితికి అద్దం ప‌డుతోంది. మంచి,ఎడు అనే తార‌త‌మ్యం మ‌రిచి కేవ‌లం మ‌తం, కులం అనే ప్రాతిప‌దిక‌పైనే ఎక్కువ మ‌మ‌కారం చూపిస్తున్నారు. సోషల్ మీడియా అనే వేదిక‌పై పిచ్చి రాత‌లు,అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో దూష‌ణ‌ల‌కు దిగుతూ ర‌క్షాసానందాన్ని పొందుతున్నారు.  (యాడ్‌ దుమారం : తనిష్క్‌ స్టోర్‌కు బెదిరింపులు )

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top