'లగ్గం టైమ్‌' షూటింగ్ పూర్తి.. వేసవిలో విడుదల | Laggam Time Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

'లగ్గం టైమ్‌' షూటింగ్ పూర్తి.. వేసవిలో విడుదల

Mar 31 2025 12:58 PM | Updated on Mar 31 2025 12:58 PM

Laggam Time Movie Shooting Completed

రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'లగ్గం టైమ్'. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. కె.హిమ బిందు నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించగా దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)

ఇక తాజా షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. 'లగ్గం టైమ్' లో యూత్ ను మాత్రమే కాదు టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని.. సినిమా చాలా బాగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా మూవీ రిలీజ్ ఉండబోతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే)

Advertisement
 
Advertisement
Advertisement