నమ్మిన సిద్ధాంతల పైనే శేఖర్‌ సినిమాలు తీస్తారు: దర్శకుడు రాజమౌళి | Kuberaa Movie Pre-Release Event | Sakshi
Sakshi News home page

నమ్మిన సిద్ధాంతల పైనే శేఖర్‌ సినిమాలు తీస్తారు: దర్శకుడు రాజమౌళి

Jun 16 2025 1:40 AM | Updated on Jun 16 2025 1:40 AM

Kuberaa Movie Pre-Release Event

సునీల్‌ నారంగ్, ధనుష్, నాగార్జున, రాజమౌళి, శేఖర్‌ కమ్ముల, రష్మికా మందన్నా, జాన్వీ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు

‘‘శేఖర్‌ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతానికి ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచ్‌ కూడా పక్కకు జరగరు. తాను నమ్మిన సిద్ధాంతాల పైనే సినిమాలు తీస్తారు. శేఖర్‌ ఇండస్ట్రీకి వచ్చిన పాతిక సంవత్సరాల్లో అలానే ఉన్నారు. అలాంటి సినిమాలే తీశారు. ఆయన అలానే ఉండాలని మేం కోరుకుంటున్నాము’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాగార్జున, ధనుష్‌ హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్‌.

సునీల్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్, బిగ్‌ టికెట్స్‌ను లాంచ్‌ చేశారు. ఈ వేదికపై ఇంకా రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ట్రాన్స్ ఆఫ్‌ కుబేర’ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో రిచ్, పూర్‌ ప్రపంచాలను ఎలా కలిపారు? నాగార్జున, ధనుష్‌గార్లను ఏ విధంగా తీసుకొచ్చారు? వీరి మధ్య డ్రామా ఎలా ఉండబోతుందన్న నాకు ఈ సినిమా ట్రైలర్‌ ఇంకా ఆసక్తిని పెంచింది’’ అని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ – ‘‘కుబేర’ శేఖర్‌ కమ్ముల సినిమా. ‘మాయా బజార్‌’లో ఎన్టీఆర్‌గారు హీరోనా? ఏయన్నార్‌గారు హీరోనా? ఎస్వీ రంగారావుగారు హీరోనా? సావిత్రిగారు హీరోనా? కాదు... కేవీ రెడ్డిగారు హీరో. అలా.. ‘కుబేర’ సినిమాకు శేఖర్‌ కమ్ముల హీరో. ఈ సినిమా కథ చెప్పగానే శేఖర్‌ కమ్ముల కోసం ఒప్పుకున్నాను. ఎన్ని సంవత్సరాలైనా మీ (అభిమానులు) ప్రేమ, ఇలానే ఉంది. నేను ఏ పాత్రలు చేసినా అప్రిషియేట్‌ చేస్తున్నారు. మీరు ఉన్నంతవరకు ఏఎన్ ఆర్‌ లివ్స్‌ ఆన్ ’’ అని చెప్పారు.

ధనుష్‌ మాట్లాడుతూ– ‘‘కుబేర’ సినిమా కోసం శేఖర్‌ కమ్ములగారు ఎంతో కష్టపడ్డారు. నాగార్జునగారితో మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. మ్యాన్  ఆఫ్‌ క్లాస్‌. నాగార్జునగారు, నేను, రష్మికల కంటే... ఫీల్డ్‌లో ఎక్కువగా డైరెక్షన్‌ టీమ్‌ కష్టపడింది. ‘కుబేర’ సినిమాలో రెండు ప్రపంచాలను చూస్తారు’’ అన్నారు.
శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాకు చెబుతుంటాను... సరస్వతీ దేవి తలదించుకోకుండా ఉంటే చాలని. కానీ ‘కుబేర’ సినిమాను సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూస్తుంది.

ఈ సినిమా నేపథ్యం ముంబై. తెలుగు, తమిళ భాషల్లో షూట్‌ చేశాం. నిజమైన పాన్  ఇండియా మూవీ ‘కుబేర’. కథ విషయంలో చైతన్య పింగళి సపోర్ట్‌ ఉంది. ‘శివ’ సినిమా టైమ్‌లో నాగార్జునగారి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాను. ‘కుబేర’ కోసం ఏమైనా చేస్తానన్నారు. ఈ సినిమాలోని బిచ్చగాడు క్యారెక్టర్‌ కోసం ధనుష్‌ సన్నబడ్డాడు. సినిమా కోసం రష్మిక ఎంతైనా కష్టపడతారు. దేవిశ్రీ నిజమైన రాక్‌స్టార్‌. మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు’’ అన్నారు.

‘‘కుబేర’ గేమ్‌ను లాంచ్‌ చేయబోతున్నాం. హిందీ, ఇతర ఏరియాల్లో ‘కుబేర’ రిలీజ్‌కు అసోసియేట్‌ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ‘ముగాఫే’ ప్రతినిధులు మనీష్, విపుల్‌. అమిగోస్‌ క్రియేషన్స్ ప్రతినిధి నాగేశ్వరరావు, కొరియోగ్రాఫర్‌ జావేద్, ఫైట్‌ మాస్టర్‌ శ్రీధర్, లిరిక్‌ రైటర్స్‌ భాస్కరభట్ల, నందకిశోర్, ప్రోడక్షన్  డిజైనర్‌ తోట తరణి మాట్లాడారు. ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిధి నిరంజన్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement