Kriti Sanon: మహేశ్‌ బాబు పాటకు కృతీసనన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Kriti Sanon Dance For Mahesh Babu Movie Song, Video Goes Viral - Sakshi

మహేశ్ బాబు ‘వన్- నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కృతీ సనన్‌. ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్‌’లో తన ప్రతిభ చాటింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. కృతీ నటించిన తాజా బాలీవుడ్‌ చిత్రం ‘భేదియా’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరుతో  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్నారు.

నవంబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘తోడేలు’ టీమ్‌ హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఈ సందర్భంగా హీరోయిన్‌ కృతీసనన్‌ మహేశ్‌ బాబు పాటకు స్టెప్పులేసి అలరించింది. మహేశ్ బాబు ‘వన్‌-నేనొక్కడినే’ చిత్రంలోని ‘హల్లో రాక్‌స్టార్‌..  ఐ ఎం యువర్ ఏంజెల్..’ పాటకు ఈ బ్యూటీ డ్యాన్స్‌ చేసింది. సినిమా విడైదలై చాలా రోజులు అయినప్పటికీ.. స్టెప్పులు మర్చిపోకుండా వేయడంతో కృతీపై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తెలుగులో తనకు బాగా నచ్చిన హీరో ప్రభాస్‌ అని, నచ్చిన సినిమా ‘పుష్ప’,‘ఆర్‌ఆర్‌ఆర్‌’అని చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top