
కృతి శెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు. కాని, బేబమ్మ అంటే ‘సి’ సెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు. పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం...
తెలుగులో కృతి శెట్టి (Krithi Shetty) మొదటి సినిమా ‘ఉప్పెన’లో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది. ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్‌తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ ఫ్యాక్టర్ ఎంతోకాలం పని చేయలేదు. రామ్ పోతినేనితో నటించిన ‘వారియర్’, నితిన్‌తో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్యతో నటించిన ‘కస్టడీ’ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి.
మాతృ భాష ఏదంటే?
అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్, పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతి శెట్టి కూడా వచ్చింది. తుళు ఆమె మాతృభాష. కృతి శెట్టి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే, క్యారెక్టర్‌ని ఇంకా బాగా పండించవచ్చని కృతి శెట్టి నమ్ముతుంది.
ఆచితూచి..
‘ఉప్పెన’ సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతి శెట్టి – ఇప్పుడు మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. ‘లవ్ టు డే’, ‘డ్రాగన్’ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న– ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మీదే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమా రిలీజ్, రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే!
హిట్ అయినా అవకాశాలు నిల్
మలయాళంలో టొవినో థామస్‌తో చేసిన ‘ఎఆర్‌ఎమ్’ హిట్ అయినా, మలయాళంలో అవకాశాలు రాలేదు. తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ, దయ ఉండాలని, అన్ని విషయాల్లో పాజిటివ్‌గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. భరించరాని ఒత్తిడికి లోనయినప్పుడు, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని, ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది. మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ట్ చేసిన ‘హృదయం’లోని ‘దర్శనా’ సాంగ్ అంటే పిచ్చి. కారులో ట్రావెల్ అవుతున్నంత సేపు అదే పాట వింటూ ఉంటానంది.
చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?