Krishnam Raju And Prabhas Home Tour Video Goes Viral - Sakshi
Sakshi News home page

Krishnam Raju Home Tour: ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు ఇల్లు చూశారా?

Mar 11 2022 11:45 AM | Updated on Mar 11 2022 1:07 PM

Krishnam Raju And Prabhas Home Tour Video Goes Viral - Sakshi

Krishnam Raju Home Tour: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో రెబల్‌స్టార్‌, ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

సినిమా రిలీజ్‌ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.  తాజాగా  ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణారాజు భార్య శ్యామలదేవీ హోంటూర్‌ చూపించారు. తమ ఇంటికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. ఇంట్లో అందరికి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తాం. ఇక కృష్ణంరాజు గారికి పురాతన వస్తువులంటే చాలా ఇంట్రెస్ట్‌. అందుకే మా ఇంట్లో అలాంటివి చాలా కనిపిస్తుంటాయి.

ఇక అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇటలీ నుంచి తెప్పించిన ఈ అందమైన బొమ్మ. 24క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఈ విగ్రహం 30ఏళ్ల క్రితం నాటిది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పూర్తి బంగారంతో తయారు చేసిన పులి బొమ్మ చాలా అరుదని, దీని ప్రత్యేకత ఏంటంటే.. 50ఏళ్ల తర్వాతే మళ్లీ కొత్తది తయారు చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్‌ తన పెదనాన్న కృష్ణంరాజుతో సమయం గడుపుతారని, వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement