Sakshi News home page

Ramesh Babu: సామ్రాట్‌గా ఎంట్రీ ఇచ్చిన రమేశ్ బాబు.. నేటికి 36 ఏళ్లు!

Published Mon, Oct 2 2023 4:42 PM

Krishna Son Ramesh Babu Entry Into Movies with Samrat As Tollywood Hero   - Sakshi

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయనకు తగ్గట్టుగానే కుమారులు సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మహేశ్ బాబు, రమేశ్‌ టాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే గతేడాది అనారోగ్యంతో పెద్దకుమారుడు రమేశ్ బాబు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే రమేశ్ ‍బాబు సినిమాల్లోకి రావడంపై సూపర్ స్టార్ కృషి ఎంతో ఉంది. రమేశ్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ఏది? ఆ తర్వాత ఏయే సినిమాలు చేశారో తెలుసుకుందాం.

(ఇది చదవండి: అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్‌పై రైడ్!)

రమేశ్ బాబు మొదట పరిచయమైంది అల్లూరి సీతారామరాజుతోనే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. 1974లో  వచ్చిన ఈ చిత్రంలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ చిత్రాల్లోనూ బాలనటుడిగా మెప్పించారు. అయితే కృష్ణ కెరీర్‌ అద్భుతంగా సాగుతున్న రోజుల్లోనే తన కుమారుడు రమేశ్‌ బాబును హీరోగా పరిచయం చేశారాయన. 

అయితే హీరోగా రమేశ్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది మాత్రం 1987లో వచ్చిన సామ్రాట్ చిత్రం ద్వారానే. ఈ సినిమాకు వి.మధుసూదన రావు దర్శకత్వం వహించగా.. హనుమంతరావు , ఆదిశేషగిరి రావు నిర్మాతలుగా వ్యవహరించారు. తన కుమారుడిని సామ్రాట్ ద్వారానే వెండితెరకు సూపర్ స్టార్ పరిచయం చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌ పద్మాలయ స్టూడియోస్‌పైనే నిర్మించారు. అయితే ఈ మూవీ 1983లో రిలీజైన హిందీ సినిమా బేతాబ్‌ రీమేక్‌గా తెరకెక్కించారు. సరిగ్గా ఈ రోజు సామ్రాట్ మూవీ విడుదల కాగా.. నేటికి 36 ఏళ్లు పూర్తయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనమ్ హీరోయిన్‌గా నటించింది. నటి శారద కీలక పాత్ర పోషించిగా.. ఈ మూవీకి అప్పట్లోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 

(ఇది చదవండి: లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!)

అయితే ఈ సినిమా తర్వాత రమేశ్ బాబు దాదాపుగా 15 చిత్రాల్లో నటించారు. ఓకే ఏడాదిలో చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు చిత్రాల్లో నటించారు.  ఆ తర్వాత బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు చిత్రాలతో పాటు శాంతి ఎనతు శాంతి ‍అనే తమిళ మూవీలో నటించారు. అయితే హీరోగా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయారు. నిర్మాతగా మారి హిందీలో సూర్యవంశం, తెలుగులో అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు. మరోవైపు తన తమ్ముడు మహేశ్ బాబు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement