క్రాక్ సినిమాటోగ్రాఫ‌ర్ పెళ్లి: కీర్తి సంద‌డి | Krack Cinematographer GK Vishnu Weds Mahalakshmi | Sakshi
Sakshi News home page

ఓ ఇంటివాడైన‌ క్రాక్ సినిమాటోగ్రాఫ‌ర్‌

Apr 25 2021 3:02 PM | Updated on Apr 25 2021 5:35 PM

Krack Cinematographer GK Vishnu Weds Mahalakshmi - Sakshi

ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ జీకే విష్ణు ఓ ఇంటివాడ‌య్యాడు. మ‌హాల‌క్ష్మి అనే యువ‌తి మెడ‌లో మూడు ముళ్లు వేసి త‌న జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది ప‌లికాడు.

క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో లాక్‌డౌన్ విధించ‌గా సినిమా షూటింగ్‌లు అర్ధాంత‌రంగా ఆగిపోయాయి. దీంతో షూటింగ్‌లు, రిలీజ్‌లు లేక‌పోవ‌డంతో సినీతార‌ల‌కు బోలెడంత స‌మ‌యం దొరికింది. ఈ క్ర‌మంలో ఎంతోమంది పెళ్లిళ్లు కూడా చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్‌లో కూడా షూ‌టింగ్‌లు ఆగిపోవ‌డంతో మ‌రోసారి పెళ్లిగంట‌లు మోగుతున్నాయి. తాజాగా ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ జీకే విష్ణు ఓ ఇంటివాడ‌య్యాడు. ఈ ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ర‌వితేజ‌ 'క్రాక్' సినిమాకు ఆయ‌న సినిమాటోగ్ర‌ఫీ అందించాడు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'బిగిల్'‌, 'మెర్స‌ల్' చిత్రాల‌తో పాటు విశాల్ 'అయోగ్య' సినిమాకు కూడా సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశాడు. ఆదివారం ఉద‌యం ఆయ‌న పి.మ‌హాల‌క్ష్మి అనే యువ‌తి మెడ‌లో మూడు ముళ్లు వేసి త‌న జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది ప‌లికాడు. కోవిడ్ కార‌ణంగా తక్కువ‌ మంది సెల‌బ్రిటీలు ఈ పెళ్లికి హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుతం వీరి వివాహ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ వేడుక‌కు హాజ‌రైన‌ మ‌హాన‌టి కీర్తి సురేశ్‌, వ‌రల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ క‌లిసి దిగిన సెల్ఫీ సైతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఫొటో చూస్తుంటే పెళ్లిలో వీళ్లు బాగానే సంద‌డి చేసిన‌ట్లు తెలుస్తోంది.

చ‌ద‌వండి: ముగ్గురు స్నేహితుల ప్రేమలో హీరోయిన్‌

మరోసారి ఆ డైరెక్టర్‌తో జతకట్టనున్న ధనుష్

Advertisement
 
Advertisement
Advertisement