మరోసారి ఆ డైరెక్టర్‌తో జతకట్టనున్న ధనుష్‌ | Dhanush And Director Mari Selvaraj Team Up For New Project After Karnan Success | Sakshi
Sakshi News home page

క్రేజీ అప్‌డేట్‌: ఆ డైరెక్టర్‌తో ధనుష్ మరో సినిమా

Apr 24 2021 8:49 PM | Updated on Apr 24 2021 8:53 PM

Dhanush And Director Mari Selvaraj Team Up For New Project After Karnan Success - Sakshi

‘కర్ణన్‌’ మూవీతో తనకు సూపర్‌హిట్‌ అందించిన దర్శకుడు మారి సెల్వరాజ్‌తో హీరో ధనుష్‌ మరోసారి జతట్టనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధనుష్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశాడు. ‘మారి సెల్వరాజ్‌తో మరో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాం’ అంటు రాసుకొచ్చాడు. ‘కర్ణన్‌’ సినిమా కోలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. థియేటర్‌ సీటింగ్‌ సామర్థ్యం కేవలం యాభై శాతం అయినప్పటికీ ఈ చిత్రం మెరుగైన వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్‌’ షూటింగ్‌ నిమిత్తం ధనుష్‌ క్యాలిఫోర్నియాలో ఉన్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement