హీరో రిక్వెస్ట్.. మరో స్టార్ హీరోను రక్షించిన సిబ్బంది! | Kollywood Hero Vishnu Vishal Rescued After Cyclone Effect In Chennai | Sakshi
Sakshi News home page

Kollywood Hero: సాయం కోరిన విష్ణు విశాల్.. చివరికీ మరో స్టార్ హీరో ప్రత్యక్షం!

Published Tue, Dec 5 2023 5:11 PM | Last Updated on Tue, Dec 5 2023 5:38 PM

Kollywood Hero Vishnu Vishal Rescued After Cyclone effect Chennai - Sakshi

మిచౌంగ్ తుపాను ధాటికి చెన్నై అతలాకుతులం అవుతోంది. ఇప్పటికే పలు లోతట్లు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆపదలో ఉ‍న్నవారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతోంది. ఇప్పటికే తుపాను దెబ్బకు ఇంటి పైకి ఎక్కినట్లు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. హీరో సాయం కోరడంపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలకు దిగారు. విశాల్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే విష్ణు విశాల్‌తో పాటు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ కూడా ఉండటం గమనార్హం.
 
ఈ సందర్భంగా విష్ణు విశాల్ తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాలాంటి వారికి సహాయం చేస్తున్న అగ్నిమాపక, రెస్క్యూ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కరపాక్కంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు అంటూ ట్విటర్(ఎక్స్‌)లో పోస్ట్ చేశారు. 

అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. సడన్‌గా అమిర్ ఖాన్‌ చెన్నైలో దర్శనమివ్వడంపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నది నిజంగా అమిర్ ఖాన్ యేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇంతకీ అమిర్ చెన్నైలో ఏం చేస్తున్నాడంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వరదలో చిక్కుకున్న స్టార్ హీరోలిద్దరినీ సేఫ్‌గా బయటకు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement