కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ధనుష్ బాలీవుడ్‌లో ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది పక్కీర్, ది గ్రే మ్యాన్ చిత్రాల్లో నటించారు. అదేవిధంగా హిందీలో రాంజానా, అట్రాంగిరే చిత్రాల్లో నటించారు. ఇక ఇటీవల తెలుగులో సార్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టారు. కాగా ప్రస్తుతం తమిళంలో కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత స్వీయ దర్శకత్వంలో తన 50వ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత )
అలాంటిది తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈయన ఇంతకుముందు నటించిన రెండు హిందీ చిత్రాలకు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా నటించిన మూడవ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నట్టు తెలిసింది. తాజా చిత్రాన్ని వైవిధ్య భరిత ప్రేమ కథాంశంతో తెరకెక్కించడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి తేరే ఇష్క్ మైన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు ధనుష్ బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇది వైమానిక దళం నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. అయితే ధనుష్ తన 50వ చిత్రాన్ని పూర్తిచేసిన తరువాతే హిందీ చిత్రంలో నటిస్తారా? లేక ఏకకాలంలో రెండు చిత్రాలు చేస్తారా కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఆయన కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
(ఇది చదవండి: షూటింగ్‌లో ప్రమాదం.. టాలీవుడ్ హీరోకు తీవ్ర గాయాలు..! )


