హీరోగా సక్సెస్‌ అవుతున్న ప్రభాస్‌ డైహార్డ్‌ ఫ్యాన్‌! | Know About Rudraveena Hero Shreeram Nimmala | Sakshi
Sakshi News home page

సినిమా పిచ్చితో ఇండస్ట్రీకి, ఇప్పుడిప్పుడే సక్సెస్‌ ట్రాక్‌లో యంగ్‌ హీరో

Oct 30 2022 8:43 PM | Updated on Oct 30 2022 8:44 PM

Know About Rudraveena Hero Shreeram Nimmala - Sakshi

హీరో ప్రభాస్‌కు వీరాభిమాని. తన సినిమాలు చూసి సినిమా మీద పిచ్చి ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఎన్నో ఇబ్బందులను దాటుకుని మరెన్నో ప్రయత్నాలు చేయగా 2020 లో 'ఉత్తర' చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది.

ఇండస్ట్రీకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు.. కానీ కొందరినే విజయం వరిస్తుంది. అలాంటి విజయమే ఇప్పుడు శ్రీరామ్ నిమ్మలని వరించింది. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీరామ్ నిమ్మలకు సినిమా అంటే పిచ్చి. హీరో ప్రభాస్‌కు వీరాభిమాని. తన సినిమాలు చూసి సినిమా మీద పిచ్చి ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఎన్నో ఇబ్బందులను దాటుకుని మరెన్నో ప్రయత్నాలు చేయగా 2020 లో 'ఉత్తర' చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. సినిమా విడుదలై శ్రీరామ్ నిమ్మలకి మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత అతడు హీరోగా నటించిన సాఫ్టువేర్ బ్లూస్, రుద్రవీణ చిత్రాలు విడుదల అయ్యాయి. రుద్రవీణ చిత్రం శ్రీరామ్‌కి మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్‌లో విజయవంతంగా రన్‌ అవుతోంది. 

ఇప్పుడు 'మది' అనే చిత్రం నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. మూడు విభిన్న చిత్రాలు, మూడు విభిన్న పాత్రలు. సాఫ్ట్ వేర్ బ్లూస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, రుద్రవీణలో కమర్షియల్ ఊర మాస్ పాత్ర చేశాడు. ఇప్పుడు మది చిత్రంలో టీనేజ్ కుర్రాడు నుంచి పరిపక్వత చెందిన వ్యక్తిగా ఒక బలమైన పాత్ర చేస్తున్నాడు. ఇకపోతే 'తురుమ్ ఖానులు' అనే సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. మరొక చిత్రం "అనుకున్నవన్నీ జరగవు కొన్ని"  పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.

చదవండి: డ్రగ్స్‌ నిషా.. రెండు రోజులు లేవకపోవడంతో అందరూ టెన్షన్‌
నా సత్య గురించి పిచ్చిపిచ్చిగా రాస్తే ఊరుకునేదే లేదు: సత్య తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement