డెబ్యూ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే’ | Kiran Kumar Is Debuting As Director With Crime Thriller Jaan Say | Sakshi
Sakshi News home page

Jaan Say : డెబ్యూ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే’

Nov 21 2022 11:18 AM | Updated on Nov 21 2022 11:23 AM

Kiran Kumar Is Debuting As Director With Crime Thriller Jaan Say - Sakshi

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్‌లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీగా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా పట్ల నిబద్దతతో ఫ్రెష్ సబ్జెక్ట్స్తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.

కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా 'జాన్ సే' టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో రూపొందిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న జాన్ సేలో అంకిత్, తన్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమా  షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఈ చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement