వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే? | Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Hits Theatres On This Date | Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha: కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా రిలీజయ్యేది అప్పుడే!

Published Sat, Oct 29 2022 6:20 PM | Last Updated on Sat, Oct 29 2022 6:20 PM

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Hits Theatres On This Date - Sakshi

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది GA2 పిక్చర్స్. ఈ బ్యానర్‌లో రాబోతున్న మరో చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా అప్పుడే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.

చదవండి: నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: కశ్మీర్‌ ఫైల్స్‌ నటుడు
బొచ్చులో ఆట నువ్వేంది ఆడించేది, బిగ్‌బాస్‌ లేడా?: గీతూపై నాగ్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement