Vibe of Vinaro Bhagyamu Vishnu Katha: అబ్బవరం మరోసారి అదరగొట్టేలా ఉన్నాడే!

Kiran Abbavaram Vibe of Vinaro Bhagyamu Vishnu Katha Teaser Trending On Youtube - Sakshi

యంగ్‌ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీర ప‌ర్ధేశీ జంట‌గా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురిళి కిషోర్ గ‌తంలో పని చేశారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. జూలై 15న హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజును పురస్కరించుకుని ఒకరోజు ముందే  'వినరో భాగ్యము విష్ణుకథ' టీజర్ విడుదల చేసారు మేకర్స్.

'నా పేరు విష్ణు.. మా ఊరు తిరుపతి.. మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ.. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా..' అని కిరణ్ చెప్తుండగానే.. హ్యాపీ బర్త్ డే విష్ణు అంటూ టీజర్ ముగుస్తుంది. యూట్యూబ్‌లో ఈ టీజర్‌ మంచి రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది.

చదవండి:  మా నాన్న రియల్‌ హీరో: వరలక్షి శరత్‌ కుమార్‌
‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్‌ పోతెన్‌ మృతి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top