కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటిస్తోన్న తాజా చిత్రం మార్క్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.
ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మార్క్ ఇంట్రో పేరుతో పవర్‌ఫుల్ యాక్షన్ టీజర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ యాక్షన్, ఫైట్స్ అభిమానలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీతో సుదీప్ సరికొత్త మార్క్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కాగా.. ఈ సినిమాను క్రిస్‌మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
Here it is,, The Teaser,, a small sneek peek into the world of#MarkTheFilm.
This Christmas. https://t.co/bLprnhCXL7 @VKartikeyaa @AJANEESHB @iampriya06 @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @kevinkumarrrr @subbu6panchu @iYogiBabu @Naveenc212 @gurusoms…— Kichcha Sudeepa (@KicchaSudeep) November 7, 2025


