వృద్ధ దంపతులకు అండగా కన్నడ హీరో కిచ్చ సుదీప్‌ | Kiccha Sudeep Takes Elderly Couple Responsibilities | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతులకు అండగా కన్నడ హీరో కిచ్చ సుదీప్‌

Jul 3 2021 10:47 AM | Updated on Jul 3 2021 10:57 AM

Kiccha Sudeep Takes Elderly Couple Responsibilities - Sakshi

బెంగళూరు: కన్న కొడుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథలను చేసినా కన్నడ హీరో కిచ్చ సుదీప్‌ తానున్నానంటూ వృద్ధ దంపతులకు ఆసరాగా నిలిచిన సంఘటన దొడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలో నివసిస్తున్న శ్రీనివాస్‌ (78), కమలమ్మ(70) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు దివ్యాంగుడు. మరో కుమారుడు తనపాలిట తల్లితండ్రులు లేరనుకుని మైసూరులో స్థిరపడిపోయాడు.

దీంతో బెంగళూరులో నివసిస్తున్న వీరు ఉన్న కాస్త ఆస్తి అమ్ముకుని బెంగళూరు నుండి దొడ్డ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. కమలమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరి గురించి తెలుసుకున్న సుదీప్‌ కమలమ్మకు బెంగళూరులోని జైన్‌ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించడంతోపాటు వారి పూర్తి బాధ్యత తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement