k3 kotikokkadu: ‘కే3 కోటికొక్కడు’ వచ్చేస్తున్నాడు

Kiccha Sudeep k3 kotikokkadu Movie Release On 17th June - Sakshi

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హీరోగా శివ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్‌ సినిమా బ్యానర్‌పై గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై  శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. 

సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు  ఉండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. తాజాగా జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 

మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధాదాస్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ లో బాగంగా మరో మూడు పాటలని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top