Kiara Advani: ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్‌

Kiara Advani Celebrate Her Birthday With Sidharth Malhotra In Dubai - Sakshi

Kiara Advani Celebrate Her Birthday With Sidharth Malhotra In Dubai: హిందీ చిత్రపరిశ్రమలో పెళ్లిళ్లు, లవ్‌ ఎఫైర్లు, చెట్టాపట్టాలు వేసుకోని షికార్లు చేయడం సర్వసాధారణమే. అయితే ఈ విషయాలపై కొందరు సూటిగా సుత్తిలేకుండా వారి రిలేషన్‌షిప్‌ గురించి బయటపెడితే, మరికొందరు గుట్టుగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా బీటౌన్‌ బ్యూటీ కియారా అద్వాణీ తన బాయ్‌ఫ్రెండ్‌తో సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈరోజు (జులై 31) కియారా అద్వానీ పుట్టినరోజు. తన బర్త్‌డేను బాయ్‌ఫ్రెండ్‌తో ఫారిన్‌లో జరుపుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, యంగ్‌ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తోందని రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన 30వ పుట్టినరోజును దుబాయ్‌లో ప్రియుడు సిద్ధార్థ్‌తో కలిసి జరుపుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలోని పలు పోస్ట్‌లను చూస్తే అర్థమవుతోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తాజాగా ఫ్యాన్స్‌తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: చివరిగా మమతా మోహన్ దాస్‌ను ఎంపిక చేశాం: డైరెక్టర్‌

అయితే వీరిద్దరూ అభిమానులతో విడివిడిగా ఫొజులివ్వడం మనం చూడొచ్చు. ఈ ఫొటోల్లో సిద్ధార్థ్‌, కియారా విడిగా ఫోజులిచ్చిన.. వారితో దిగిన ఫ్యాన్స్‌ వేసుకున్న దుస్తులు ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు. దీంతో కియారా తన బర్త్‌డేను సిద్ధార్థ్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమని తెలుస్తోంది. 

చదవండి: కాజోల్‌ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్‌ దేవగణ్‌ స్పెషల్‌ పోస్ట్‌

కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్షా' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇటీవల కరణ్ జోహర్ టాక్‌ షో 'కాఫీ విత్ కరణ్‌' 7వ సీజన్‌ ఎపిసోడ్‌లో వారిద్దరూ డేటింగ్‌ చేస్తున్నట్లు అనన్య పాండే హింట్ కూడా ఇచ్చింది. కాగా మహేశ్‌ బాబు 'భరత్‌ అనే నేను' మూవీతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ మెప్పించిన విషయం తెలిసిందే. 

చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్‌..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top