Mamta Mohandas: ఆ పాత్ర కోసం అనేకమంది హీరోయిన్లను సంప్రదించాం.. కానీ..

Mamta Mohandas Plays As Kanmani In Thangar Bachan Film - Sakshi

Mamta Mohandas Plays As Kanmani In Thangar Bachan Film: భారతీరాజా, యోగిబాబు, గౌతం మీనన్‌ ప్రముఖ పాత్రలతో తంగర బచ్చాన్‌ దర్శకత్వం ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ నెల 25 నుంచి కుంభకోణంలో షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'కరుమేగంగల్‌ కలైకిండ్రన్‌' అనే టైటిల్‌ను నిర్ణయించారు. చెన్నై, రామేశ్వరం ప్రాంతాల్లో షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ తెరపై చూడనటువంటి వైవిధ్యభరిత అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందన్నారు. 

కణ్మణి అనే పాత్ర కోసం ఇండియాలోని పలు నటీమణులతో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించిన చివరికి నటి మమతా మోహన్‌దాస్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉందని మమతా మోహన్‌దాస్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్, ఆర్‌వీ ఉదయ్‌కుమార్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని శుక్రవారం (జులై 29) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top