
మాస్‌మహారాజా రవితేజ మూవీలో బాలీవుడ్‌నటుడు నికితిన్ ధీర్ నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
సాక్షి,హైదరాబాద్: టాలీవుడ్ హీరో రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడి కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అపడేట్ వెలుగులోకిచ్చింది. క్రాక్ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న ఈ మాస్ మహారాజా మూవీలో బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా మరో అప్‌టేడ్‌తో ముందుకొచ్చింది. నికితిన్ ధీర్ వెల్‌కం చెబుతూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ సినిమాలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ నటిస్తోందంటూ అధికారికంగా ప్రకటించిన యూనిట్ ఆమెను ఆహ్వానిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఖిలాడి (ప్లేస్మార్ట్) మూవీలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మే 28న ఖిడాడీ రిలీజ్ కానుందంటూ రవితేజ ఇప్పటికే ట్విటర్ ద్వారా ప్రకటించారు.
Team #Khiladi Welcomes Bollywood Actor @nikitindheer on Board! 💪🏻🔥
— #Khiladi (PLAY SMART) (@KHILADiOffl) February 5, 2021
Another strong Contender joined to PLAY SMART! 🃏⏯️@RaviTeja_offl @DirRameshVarma @ThisIsDSP @DimpleHayathi @Meenachau6 @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies @KHILADiOffl pic.twitter.com/t8alOSSAGx