
గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో వింత పరిస్థితి. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్‌ల హడావుడి ఎక్కువైపోయింది. స్టార్ హీరోల మూవీస్ అయితే అభిమానులు, సదరు చిత్రాల్లో సీన్లని రీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగానూ అంతకు మించి అనేలా ఓ అభిమాని రచ్చ చేశాడు. ఏకంగా థియేటర్లలోకి పాము తీసుకొచ్చి హల్‌చల్ చేశాడు.
(ఇదీ చదవండి: నటి స్నానం చేసిన నీటితో సబ్బు.. రేటు ఎంతంటే?)
తెలుగు రాష్ట్రాల్లో తాజాగా మహేశ్ బాబు 'ఖలేజా'ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సీన్లకు తగ్గట్లు కొందరు ఆస్పత్రి డ్రస్ వేసుకుని వెళ్లగా, మరికొందరు కుండీతో మొక్కని తీసుకెళ్లారు. విజయవాడలో ఓ అభిమాని మాత్రం థియేటర్లలోకి పాముని తీసుకెళ్లాడు. సినిమా ప్రారంభంలో మహేశ్ బాబు పాముని పట్టుకుని.. విలన్లకి పైకి విసురుతాడు. ఇప్పుడు అభిమాని కూడా.. స్క్రీన్ దగ్గర పాముతో కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
'గుంటూరు కారం' తర్వాత మహేశ్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇది రావడానికి మరో మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. అందుకే మహేశ్ ఫ్యాన్స్.. 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల సీన్లని రీ క్రియేట్ చేస్తూ నెట్టింట వైరల్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తొలిరోజు భారీగానే వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!)
ఇదేమీ సీన్ రిక్రియేషన్ పిచ్చిరా బాబు...
విజయవాడలో ఖలేజా రీరిలీజ్ సందర్భంగా ఓ అభిమాని హల్‌చల్.
సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్లోకి పాముని తీసుకెళ్లి, స్క్రీన్ పైకి ఎక్కి వీరంగం సృష్టించాడు.#KhalejaReRelease #MaheshBabu pic.twitter.com/kJbWY6ptFE— greatandhra (@greatandhranews) May 30, 2025