
మంచు ఫ్యామిలీలో చాన్నాళ్లుగా గొడవలు సాగుతున్నాయి. వీటి గురించి మళ్లీ చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నిరోజులుగా మాత్రం విష్ణు, మనోజ్ సైలెంట్‌గానే ఉన్నారు. మనోజ్ కీలక పాత్రలో నటించిన 'భైరవం' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ మనోజ్.. 'శివయ్య' అంటూ కామెంట్ చేశాడు. తర్వాత సారీ చెప్పాడు. ఇప్పుడు మరోసారి అన్న విష్ణుని రెచ్చగొట్టేలా ఓ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది.
(ఇదీ చదవండి: అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?)
'భైరవం' రిలీజ్ వేళ తండ్రితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్.. 'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' అని మోహన్ బాబుతో కలిసున్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో కేవలం మోహన్ బాబు-మనోజ్ మాత్రమే ఉండటంతో ఇదేదో విష్ణుని రెచ్చగొట్టేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చాలా ఏళ్లుగా సినిమాలు చేయడం మానేసిన మంచు మనోజ్.. 'భైరవం' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇందులోబెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ హిట్ మూవీ 'గరుడన్'కి రీమేక్ ఇది. అలానే తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' అనే పాన్ ఇండియా మూవీలో మనోజ్ విలన్‌గా నటించాడు. ఇది సెప్టెంబరులో రిలీజ్ కానుంది. మరోవైపు మంచు విష్ణు కూడా 'కన్నప్ప' మూవీతో చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)