KGF: Chapter 2 Day 2 Box Office Collection: Yash's Movie Enter 200 Crore Club - Sakshi
Sakshi News home page

KGF2 Second Day Box Office Collections: రికార్డ్స్‌..రికార్డ్స్‌..రికార్డ్స్‌

Apr 16 2022 4:44 PM | Updated on Apr 16 2022 5:22 PM

KGF Chapter 2 Second Day Box Office Collections - Sakshi

ఇండియన్‌ బాక్సాఫీస్‌పై కేజీయఫ్‌-2 హవా కొనసాగుతోంది. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం(ఏప్రిల్‌ 14)విడుదలై, తొలిరోజు నుంచే హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదేస్థాయిలో వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులకు గాను ఈ చిత్రం దాదాపు 240 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది.

టాలీవుడ్‌లో  తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్‌ సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.12.95 కోట్లను రాబట్టింది. రెండో రోజుల్లోనే ఓ డబ్బింగ్‌ మూవీ టాలీవుడ్‌లో రూ.33 కోట్ల షేర్‌ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు  రజనీకాంత్‌ ‘రోబో’పేరిట ఉండేది. టాలీవుడ్‌లో ఈ మూవీకి రూ. 74 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది.

ఇక బాలీవుడ్‌లోనూ కేజీయఫ్‌ హవా మాములుగా లేదు. అక్కడ తొలి రోజే రూ.50 కోట్లు వసూళ్లు చేసింది. రెండో రోజు దాదాపు 45 కోట్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా. కేవలం రెండు రోజుల్లోనే హిందీలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఇక వీకెండ్ కావడంతో శని,ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్‌ వీక్‌ ముగిసేసరికి ఈ మూవీ ఎన్ని వందల కోట్లను కలెక్ట్‌ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌, హీరోయిన్‌గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement