KGF Chapter 2 OTT Release: Yash's KGF 2 Release on Amazon Prime Video - Sakshi
Sakshi News home page

KGF 2: అప్పుడే ఓటీటీకి ‘కేజీయఫ్‌ 2’, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ అంటే..!

Apr 15 2022 5:43 PM | Updated on Apr 15 2022 6:20 PM

kGF Chapter 2 OTT Release Date Confirmed, News Goes Viral - Sakshi

తొలిరోజే దాదాపు 135 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డుని సృష్టించింది

టాలీవుడ్‌,బాలీవుడ్‌ అని కాదు.. ప్రస్తుతం ఏ చిత్రపరిశ్రమలో అయినా ‘కేజీయఫ్‌ 2’ సినిమా గురించే చర్చ జరుగుతుంది. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కేజీయఫ్‌ 2’  చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యశ్‌ యాక్షన్‌కి, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని స్పందన లభిస్తోంది. తొలిరోజే దాదాపు 135 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డుని సృష్టించింది. అందులో ఒక్క బాలీవుడ్‌లోనే దాదాపు రూ.50 కోట్లను రాబట్టడం మరో విశేషం. ఇలాగే కొనసాగితే...ఈ వీకెండ్‌లోపే 500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం.

(చదవండి: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్‌ దాడి.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..)

తమ అభిమాన హీరో చిత్రానికి ఇంతటి ఘన విజయం లభించడం పట్ల యశ్‌ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇదే సమయంలో  ‘కేజీయఫ్‌’ అభిమానులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చే వార్త ఒక్కటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారట. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మే 13న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు తెలిసింది.అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. హోంబలే ఫిలింస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. విలన్‌ అధీరా పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ పోషించాడు.

(చదవండి: కేజీయఫ్‌ 2 రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement