KGF: Chapter 2 Day 1 Box Office Collection: Yash's Movie Creates New Records - Sakshi
Sakshi News home page

KGF2 First Day Box Office Collections: రాకీ భాయ్‌ విధ్వంసం.. టాలీవుడ్‌లో రికార్డు

Apr 15 2022 3:22 PM | Updated on Apr 15 2022 5:23 PM

KGF Chapter 2 First Day Box Office Collections - Sakshi

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో  యష్‌ హీరోగా తెరకెక్కిచ చిత్రం ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’. భారీ అంచనాల మధ్య గురువారం(ఏప్రిల్‌ 14) విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌కు, విజ‌న్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో విడుదలైన కేజీయఫ్‌కి తొలుత మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కాస్త వెనకపడింది. తర్వాత పబ్లిక్‌ మౌత్‌తో జనాల్లోకి వెళ్లి భారీ కలెక్షన్స్‌ రాబట్టిన విషయం తెలిసిందే. అయితే  కేజీయఫ్‌కి ఆ గండం లేకుండా పోయింది. పార్ట్‌ 1 సూపర్‌,డూపర్‌ హిట్‌ కావడంతో...పార్ట్‌ 2 అంతకు మించేలా ఉంటుందని అంతా భావించారు. అందుకే విడుదల ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది.

విడుదల తర్వాత సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి..మరోసారి సౌత్‌ సినిమాల సత్తా ఏంటో యావత్‌ భారత్‌కు తెలియజేసింది. బాలీవుడ్‌లోనే దాదాపు రూ.50 కోట్లను వసూళ్లు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం  తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ డబ్బింగ్‌ మూవీ టాలీవుడ్‌లో ఇంత కలెక్ట్‌ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్‌ ‘రోబో 2.O’(రూ.12.45 కోట్లు) ఉండేది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిసి మరో రూ.50 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా తొలిరోజు రాకీభాయ్‌ విధ్వంసమే సృష్టించాడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌, హీరోయిన్‌గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు.

(చదవండి: ‘కేజీయఫ్‌ 2’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement