'తుఫాన్‌' ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా ! | KGF 2: Yash Starrer Toofan Full Song Released | Sakshi
Sakshi News home page

KGF 2: 'తుఫాన్‌' ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా !

May 18 2022 4:38 PM | Updated on May 18 2022 4:42 PM

KGF 2: Yash Starrer Toofan Full Song Released - Sakshi

KGF 2: Yash Starrer Toofan Full Song Released: కన్నడ స్టార్‌ హీరో యశ్‌, శాంత్ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్‌ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్‌ 2'. ఓ పక్క అత్యధిక వసూళ్లు రాబట్టగా మరోపక్క విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. బాలీవుడ్‌లో రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్‌లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమాలోని డైలాగ్‌లు, యాక్షన్‌ సీన్లు, యశ్ యాక్టింగ్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, పాటలు అన్ని సినిమాకు హైలెట్ అయ్యాయి.

'కేజీఎఫ్ 2'లోని ప్రతి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల అమ్మ పాట, మెహబూబా సాంగ్‌లను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా తుఫాన్‌ పాటను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం తుఫాన్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. బాలీవుడ్‌ స్టార్స్ సంజయ్ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్, రావు రమేశ్, శ్రీనిధి శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్‌ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

చదవండి: 'కేజీఎఫ్‌ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ?

Advertisement
 
Advertisement
Advertisement