Hombale Films Producer Karthik Gowda Says About KGF 3 - Sakshi
Sakshi News home page

KGF 3: 'కేజీఎఫ్‌ 3'పై నెలకొన్న సందిగ్ధత.. మరో నిర్మాత స్పందన

May 15 2022 2:47 PM | Updated on May 15 2022 3:42 PM

Hombale Films Producer Karthik Gowda About KGF 3 - Sakshi

యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్‌ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్‌ 2'. ఓ పక్క కలెక్షన్లు మరోపక్క ప్రేక్షకుల మౌత్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్‌ 3' రానుందని శనివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

Hombale Films Producer Karthik Gowda About KGF 3: యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్‌ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్‌ 2'. ఓ పక్క కలెక్షన్లు మరోపక్క ప్రేక్షకుల మౌత్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్‌లో అయితే రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్‌లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్‌ 3' రానుందని శనివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

కేజీఎఫ్‌ 3 మూవీని మార్వెల్‌ తరహాలో తెరకెక్కించనున్నట్లు, అక్టోబర్‌ తర్వాత షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు హోంబలే సంస్థ నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై హోంబలో సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్‌ గౌడ స్పందించారు. 'సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా వద్ద చాలా మంచి ప్రాజెక్ట్స్‌ ఉ‍న్నాయి. వాటిపైనే మా దృష్టి ఉంది. కాబట్టి ఇప్పట్లో హోంబలే సంస్థ 'కేజీఎఫ్‌ 3'ని తెరకెక్కించలేదు. ఒకవేళ షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాం.' అని కార్తిక్‌ గౌడ ట్వీట్‌ చేశారు. 

చదవండి: 'కేజీఎఫ్‌ 3'పై క్లారిటీ.. మార్వెల్‌ ఫ్రాంచైజీ తరహాలో సినిమా


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement