
రాఖీ భాయ్ కలెక్షన్ల తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
KGF 2: Voice Of Every Mother Full Song Released: రాఖీ భాయ్ కలెక్షన్ల తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలోన యాక్షన్ సీన్స్, పాటలు ఆడియెన్‌ను ఒక రేంజ్‌లో ఉర్రూతలూగించాయి. యాక్షన్, ఎలివేషన్స్, సాంగ్స్, బీజీఎంకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇందులో కొడుకు గురించి తల్లి పాడే ఎదగరా ఎదగరా అనే పాట ప్రతి ఒక్కరికీ గుర్తు ఉంటుంది. ఈ పాటను 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్ (అమ్మ పాట)' అని ఇదివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదివారం (మే 8) మదర్స్ డే సందర్భంగా పూర్తి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. 'వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్' అని ట్వీట్ చేస్తూ షేర్ చేశారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి.
చదవండి: విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి
ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Voice of every MOTHER!#GaganaNee/#FalakTuGarajTu/#YadagaraYadagara/#AgilamNee/#GaganamNee : https://t.co/lsnsFyAupu#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @RaviBasrur @LahariMusic @Mrtmusicoff pic.twitter.com/b2RbaKR8U0
— RamajogaiahSastry (@ramjowrites) May 8, 2022