RGV-Prashanth Neel: కేజీయఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Gopal Varma Interesting Comments Prashanth Neel On Directors Day - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ.. అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ.. తన రూటే సపరేట్ అంటాడు. నిత్యం సెలబ్రెటీలను సటైరికల్‌ కామెంట్స్‌తో కవ్విస్తుంటాడు. ఏ అంశాన్ని అయినా భిన్నమైన కోణంలో చూసి.. దానిని నిస్సందేహం వ్యక్తం చేస్తూ విమర్శలకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తాడు. అలాంటి ఆర్జీవీ డైరెక్టర్స్‌ డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్‌ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్‌ నీల్‌. ఈ మూవీతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా దర్శకుడిగా మారాడు. దీంతో ప్రశాంత్‌ నీల్‌పై వర్మ వరుస ట్వీట్స్‌ చేస్తు ప్రశంసలు కురిపించాడు.

చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి

‘ప్రశాంత్‌ నీల్‌.. మీకు అన్‌ హ్యాపీ డైరెక్టర్స్‌ డే. కేజీయఫ్‌ మూవీతో మీరు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌ దర్శకులకు కనువిప్పు కలిగించారు. ఇండియన్‌ సినిమాకు మీరు వీరప్పన్‌ లాంటి వారు’ అంటూ వర్మ కొనియాడాడు. సంప్రదాయ పరమైన సినీ పరిశ్రమలకు చెందిన 95 శాతం ప్రజలకు మీ కేజీయఫ్‌ సినిమా నచ్చి ఉండదు. ఈ మూవీతో మీరు సినీ పరిశ్రమలోని పాత పద్దతిని దూరం చేసి కొత్త పద్దతిని పరిచయం చేశారు’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాగాక ఎంతో మంది రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారు కానీ, వాళ్లు వేస్ట్ చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారంటూ ప్రశాంత్‌ నీల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు వర్మ. 

చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లి, హింట్‌ ఇచ్చేసిందిగా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top