Allu Arjun Praises Actor Yash And KGF 2 Movie Team, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun Praises KGF 2 Team: కేజీఎఫ్‌ 2 మూవీపై అల్లు అర్జున్‌ ప్రశంసలు

Apr 22 2022 1:57 PM | Updated on Apr 22 2022 3:03 PM

Allu Arjun Praises Actor Yash And KGF 2 Movie Team, Tweet Goes Viral - Sakshi

తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాపై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించాడు. భారీ విజయాన్ని అందుకున్న కేజీఎఫ్‌ 2 యూనిట్‌కు కంగ్రాట్స్‌ చెప్తూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. 'కేజీఎఫ్‌ 2 చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు...

ఒక్క బాలీవుడ్‌లోనే కాదు దేశమంతటా ఇప్పుడు సౌత్‌ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి (1, 2), కేజీఎఫ్‌, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పుడు కేజీఎఫ్‌ 2 ఇవన్నీ ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టుకుంటూ విశేషాదరణ పొందినవే. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌ 14న రిలీజైన కేజీఎఫ్‌ 2 వసూళ్ల ఊచకోత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎక్కడైనా సరే రికార్డులను తొక్కుకుంటూ పోవాలే అన్న పంథాలో బాక్సాఫీస్‌ దగ్గర పరుగులు పెడుతోందీ చిత్రం.

తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాపై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించాడు. భారీ విజయాన్ని అందుకున్న కేజీఎఫ్‌ 2 యూనిట్‌కు కంగ్రాట్స్‌ చెప్తూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. 'కేజీఎఫ్‌ 2 చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు. యశ్‌ గారు మీ నటన అద్భుతం, అమోఘం. సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, శ్రీనిధి శెట్టి తదితర నటీనటులందరూ బాగా నటించారు. రవి బస్రూర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరో లెవల్‌లో ఉంది. భువనగౌడ ఎక్సలెంట్‌ విజువల్స్‌ అందించారు. సాంకేతిక నిపుణుల అపార కృషికి నా గౌరవాభినందనలు' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

మరో ట్వీట్‌లో 'ప్రశాంత్‌ నీల్‌ అద్భుతమైన సినిమా అందించారు. మీరు ఏదైతే కలగన్నారో దాన్ని నిజం చేసి చూపించారు. ఇంత మంచి అనుభవాన్నిచ్చినందుకు, భారతీయ సినిమా ఖ్యాతిని పెంపొందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు బన్నీ.

చదవండి: యశ్‌ నుంచి ప్రశాంత్‌ నీల్‌ దాకా.. కేజీఎఫ్‌ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే?

ఇకపై తాను సింగిల్‌ కాదు కమిటెడ్‌ అంటోన్న బుల్లితెర నటి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement