Unni Mukundan: లైంగిక వేధింపుల కేసు.. ఉన్ని ముకుందన్‌కు హైకోర్టు షాక్!

Kerala High Court rejects Unni Mukundan petition in assault case   - Sakshi

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్‌మెంట్‌ కుదిరిందని ఊహగానాలు కూడా వచ్చాయి.   

(ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు')

కాగా.. 2017 ఆగస్టు 23న సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకు ఫిర్యాదులో చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్‌మెంట్‌లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు.

ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆయనకు కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో నటుడు తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు. 

(ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్‌.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!)

కాగా.. నటుడు చివరిసారిగా 'మలికాపురం చిత్రంలో కనిపించారు. 2011లో 'సీడన్' అనే తమిళ సినిమాతో ముకుందన్  తెరంగేట్రం చేశారు. అతను మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు.  2020లో ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌ని ప్రొడక్షన్‌ బ్యానర్‌ నడుపుతున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top