రౌడీతో జోడీ?  | Keerthy Suresh opposite Deverakonda in Rowdy Janardhana | Sakshi
Sakshi News home page

రౌడీతో జోడీ? 

Mar 28 2025 1:43 AM | Updated on Mar 28 2025 1:43 AM

Keerthy Suresh opposite Deverakonda in Rowdy Janardhana

‘రౌడీ జనార్థన’తో జోడీ కట్టనున్నారట కీర్తీ సురేష్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన’ అనే మూవీ తెరకెక్కనుంది. ‘దిల్‌’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

 మేలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుందని తెలిసింది. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. కథ నచ్చడంతో కీర్తీ సురేష్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. మరి... విజయ్‌ దేవరకొండ–కీర్తీ సురేష్‌ల జోడీ సెట్‌ అవుతుందా?  లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. 

Advertisement
 
Advertisement
Advertisement