టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్‌లో బక్క పలచని కుర్రాడిలా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా మెప్పించారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తోన్న మూవీ బ్లాక్‌మెయిల్. ఈ చిత్రానికి శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా నా వైఫ్ మిస్సింగ్ అనే మూవీ కూడా చేస్తున్నారు.
ఈ నెల 21న వరుణ్ సందేశ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఇండస్ట్రీలో దిల్ రాజు, అల్లరి నరేశ్ చాలా సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే సమయంలో ఓ గ్రాసరీ షాప్‌లో పనిచేశా.. అంతేకాకుండా క్యాషియర్‌గా కూడా పని చేశానని వరుణ్ తెలిపారు.
నా కెరీర్‌లో ఎత్తు, పల్లాలు చూశానని వరుణ్ సందేశ్ తెలిపారు. నా కెరీర్ డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు డీ ఫర్ దోపీడి మూవీలో దిల్ రాజు ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. అల్లరి నరేశ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నా కష్టాల్లో అండగా నిలిచిన వీరిద్దరిని ఎప్పటికీ మరిచిపోలేనని వరుణ్ సందేశ్ తన మనసులోని మాటలు పంచుకున్నారు.


