ఈ టాప్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా.. ఎందుకు ఇంతలా కష్టపడుతుందంటే | Keerthy Suresh Entry In Bollywood | Sakshi
Sakshi News home page

ఈ టాప్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా.. ఎందుకు ఇంతలా కష్టపడుతుందంటే

Published Sun, Oct 15 2023 6:41 AM | Last Updated on Sun, Oct 15 2023 6:50 AM

Keerthy Suresh Entry In Bollywood - Sakshi

నటి కీర్తి సురేష్‌ మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఆ మధ్య వరుస ప్లాప్‌లతో కెరీర్‌ పరంగా కొంచెం తడబడినా, ఆ తర్వాత తెలుగులో నానితో జతకట్టిన దసరా, తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ సరసన నటించిన మామన్నన్‌ చిత్రాలతో విజయాల బాట పట్టింది. కాగా ప్రస్తుతం తమిళంలోనే నాలుగైదు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రఘు తాత, రివాల్వర్‌ రీటా వంటి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలతో పాటు జయం రవి సరసన నటిస్తున్న సైరన్‌ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్‌కు మరోసారి బాలీవుడ్‌ అవకాశం పలకరించింది.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

ఈమె ఇంతకుముందే హిందీ చిత్రంలో నటించాల్సి ఉంది. అజయ్‌ దేవగన్‌ కథానాయకుడిగా నటిస్తున్న మైదాన్‌ చిత్రంలో కీర్తి సురేష్‌నే మొదట హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ చిత్రం కోసం బాగా వర్క్‌ అవుట్‌ లు కూడా చేసింది. అదే ఆమె ఆ చిత్రాన్ని కోల్పోవడానికి కారణమైంది. కీర్తి సురేష్‌ సన్నబడటంతో చిత్ర దర్శక నిర్మాతలు ఆమెను మైదాన్‌ చిత్రం నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. కాగా తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రం ఈ బ్యూటీని వరించింది. తమిళంలో విజయ్‌ కథానాయకుడిగా, సమంత, ఎమీ జాక్సన్‌ నాయకిలుగా అట్లీ దర్శకత్వం వహించిన చిత్రం తెరి. ఇది మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతో దర్శకుడు అట్లీ హిందీలో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు.

ఈయన ఇప్పటికే దర్శకుడుగా షారుక్‌ ఖాన్‌, నయనతార, దీపికా పడుకొనే వంటి తారలతో జవాన్‌ చిత్రానికి దర్శకత్వం వహించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నిర్మాతగా ఎంట్రీ ఇస్తూ బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ హీరోగా తెరి చిత్రాన్ని, నటి కీర్తి సురేష్‌ బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. తెరి తమిళ్‌ వెర్షన్‌లో సమంత నటించిన పాత్రను హిందీలలో కీర్తి సురేష్‌ పోషించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో మరింత ఫిట్‌నెస్‌గా కనిపించడానికి కీర్తి సురేష్‌ ఇప్పుడు తీవ్రంగా వర్కౌట్స్‌ చేస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement