డైహార్ట్‌ ఫ్యాన్‌కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్‌ | Sakshi
Sakshi News home page

ఫలించిన నిరీక్షణ.. డైహార్ట్‌ ఫ్యాన్‌కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్‌

Published Sat, Jan 27 2024 7:14 AM

Keerthy Suresh Apologises To Fan - Sakshi

అభిమానులు లేనిదే ఏ స్టార్‌ లేరులే అన్నారో గీత రచయిత. ఇది మాత్రం నగ్న సత్యం. అందుకే నటీనటులు అభిమానులే తమ దేవుళ్లు అంటారు. ఇక అభిమానుల విషయానికొస్తే ఏ నటుడుగానీ, నటి గానీ వారికి నచ్చితే నెత్తినేసుకుని మోసేస్తారు. వారికి గుళ్లు, గోపురాలు కట్టి ఆరాధిస్తారు. సిరాతో కాకుండా రక్తంతో లేఖలు రాసే పిచ్చి అభిమానులు ఉంటారు. మరి కీర్తీసురేష్‌కు ఇలాంటి ఒక వీరాభిమానే ఉన్నాడు. బాలనటిగా నట జీవితాన్ని ప్రారంభించిన ఈమె, ఆ తరువాత కథానాయకిగా పరిచయం ఆపై తమిళం, తెలుగు, హిందీ అంటూ ప్రముఖ కథానాయకి స్థాయికి ఎదిగిన నటి కీర్తీసురేష్‌.

అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న అరుదైన నటి కీర్తీసురేష్‌. అదేవిధంగా కథానాయకి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించి మెప్పించే స్థాయికి ఎదిగారు. కోలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా వున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో విజయ్‌, సమంత, ఎమిజాక్సన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన అట్లీ దర్శకత్వం వహించిన తెరి చిత్ర హిందీ రీమేక్‌లో కీర్తీసురేష్‌ నటిస్తున్నారు.

తమిళంలో సమంత నటించిన పాత్రను హిందీలో పోషిస్తున్నారు. ఈమె కథానాయకిగా నటించిన సైరన్‌, రఘుతాత, రివాల్వర్‌ రీటా, కన్నివెడి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి క్రేజీ నటి ఒక అభిమానికి క్షమాపణ చెప్పడం విశేషం. కృష్ణ అనే ఈమె వీరాభిమాని వరుసగా 233 లేఖలు రాసి ఆమెకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అప్పటికి అతని లేఖలకు స్పందించని కీర్తీసురేష్‌ 234వ లేఖకు బదులిచ్చారు. ఆమె ట్విట్టర్‌ ద్వారా అతని లేఖలకు స్పందిస్తూ 234 తనకు ఫాంటసీ నంబర్‌ అని పేర్కొన్నారు. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు లాట్సాప్‌ లవ్‌ అని పేర్కొంది. ఆమె ఈ ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌అవుతోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement