కీర్తి సురేష్‌ పెళ్లి ఫోటో వైరల్‌.. అల్లుడూ అంటూ వరుడికి కాల్‌ చేసిన మేనక | Actor Satheesh Gives Clarity On Marriage Rumour About His Pic With Keerthy Suresh Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthy Suresh Marriage Rumours: కీర్తి సురేష్‌ పెళ్లి ఫోటో వైరల్‌.. అల్లుడూ అంటూ వరుడికి కాల్‌ చేసిన మేనక

Published Mon, Feb 19 2024 8:25 AM

Keerthy Suresh And Sathish Photo Viral - Sakshi

సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కు ఎనలేని గుర్తింపు ఉంది. ఎక్కువగా సినిమా సెట్స్‌లో మాత్రమే కనిపించే ఈ బ్యూటీ గురించి తెగ రూమర్స్‌ వస్తూ ఉంటాయి. ఫంక్షన్స్‌,పార్టీలు అంటూ అందరు హీరోయిన్లు కనిపిస్తూనే ఉంటారు కానీ కీర్తి సురేష్‌ మాత్రం పెద్దగా ఎక్కడా కనిపించదు కూడా.. ఎందుకో కానీ ఆమె వ్యక్తిగత జీవితంపై విపరీతమైన రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి.

గతంలో సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఆమె తండ్రి ఖండించడంతో అవి ఆగిపోయాయి. ఆ తర్వాత  పలాన పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం, ఆ రాజకీయవేత్తతో వివాహం, ఆ నటుడితో పెళ్లి వంటి పుకార్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి గురించి ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కొన్నాళ్ల క్రితం కీర్తి సురేష్ తమిళ కమెడియన్ సతీష్‌ని పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం వితికారన్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న నటుడు సతీష్, దాని గురించి ఇలా చెప్పాడు. 'దళపతి విజయ్ నటించిన భైరవ చిత్రంలో కీర్తి సురేష్‌తో నటించాను. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరి మెడలో పూల మాలలు వేసుకున్నాం. ఈ క్రమంలో మేమిద్దరమూ కూడా పూలమాలలు ధరించాం. ఫోటోలో మా ఇద్దరినీ మాత్రమే హైలెట్‌ చేసి కొందరు వైరల్‌ చేశారు. దీంతో తాము రహస్యంగా వివాహం చేసుకున్నామంటూ చాలా పుకార్లు వచ్చాయి. చాలా బాధ అనిపించింది.

ఆ సమయంలో కీర్తి సురేష్‌ అమ్మగారు మేనక నాకు ఫోన్‌ చేసి కంగ్రాట్యులేషన్స్ అల్లుడు అన్నారు. అప్పుడు నేను షాక్‌ అయ్యాను. ఆ రూమర్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదని అప్పుడు అర్థం అయింది. 2019లో నేను సింధుని వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పుకారు ముగిసింది. అని ఆయన చెప్పాడు. 

కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా ఉన్న సతీష్‌ ఇప్పటి వరకు సుమారు 70 కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వితికారన్ చిత్రం ద్వారా ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంటర్వ్యూలలో ఆయన పాల్గొంటున్నాడు. శివకార్తికేయన్‌- కీర్తి సురేష్‌ నటించిన రెమో సినిమాలో కూడా వారిద్దరూ కలిసి నటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement