యాచకుడిగా మారిన హీరో.. | Kavin Starrer Bloody Beggar Movie Update | Sakshi
Sakshi News home page

జైలర్‌ డైరెక్టర్‌ కొత్త మూవీ.. యాచకుడిగా మారిన హీరో!

Published Fri, May 10 2024 11:43 AM | Last Updated on Fri, May 10 2024 12:06 PM

Kavin Starrer Bloody Beggar Movie Update

కొన్ని చిత్రాల టైటిల్స్‌ ప్రారంభంలోనే హైప్‌ తీసుకొస్తాయి. బ్లడీ బెగ్గర్‌ టైటిల్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. కోలమావు కోకిల, డాన్, బీస్ట్, జైలర్‌ వంటి చిత్రాలతో స్టార్‌ దర్శకుడిగా రాణిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ మూవీతో నిర్మాతగా మారుతున్నారు. ఫిలమెంట్‌ ఫిక్చర్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తన శిష్యులును, ఇతర ప్రతిభావంతులైన నూతన దర్శకులను ప్రోత్సహించనున్నారు. 

బ్లడీ బెగ్గర్‌
వారితో కలిసి మంచి కథా చిత్రాలను నిర్మించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా బ్లడీ బెగ్గర్‌ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కవిన్‌ కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా నెల్సన్‌ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న శివబాలన్‌ ముత్తుకుమార్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. 

బిచ్చగాడి గెటప్‌లో 
ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను దర్శకుడు నెల్సన్, నటుడు రెడిన్‌ కింగ్‌స్లీ, కవిన్, శివబాలన్‌లు నటించిన ఓ ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అలాగే బ్లడీ బెగ్గర్‌ పేరుతో కవిన్‌ బిచ్చగాడి గెటప్‌లో ఉన్న పోస్టర్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే కవిన్‌ హీరోగా నటించిన స్టార్‌ మూవీ తమిళనాట నేడే (మే 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

చదవండి: నేరుగా ఓటీటీకి మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement