మా అమ్మ మధురైలో ఓ స్కూల్‌లో పని చేసింది: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Katrina Kaif: చెన్నై అంటే చాలా ఇష్టం.. అమ్మ కూడా మధురైలో ఓ స్కూల్‌లో..

Published Mon, Jan 8 2024 9:57 AM

Katrina Kaif Interesting Comments on Merry Christmas Movie - Sakshi

విజయ్‌సేతుపతితో కలిసి నటించడం మంచి అనుభవమని బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ అన్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించిన ఈమె తొలిసారిగా మెర్రీ క్రిస్మస్‌ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించారు. బద్లాపూర్‌, అంధదూన్‌ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని ఓ స్టార్‌ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

దుబాయ్‌లో పని చేశా.. అందుకే
విజయ్‌సేతుపతి, కత్రికా కైఫ్‌, దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ సహా తదితరులు పాల్గొన్నారు. విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. తను ఆరంభ దశలో దుబాయిలో పని చేయడం వల్ల హిందీ భాష తెలుసన్నారు. అది ఈ చిత్రానికి బాగా హెల్ప్‌ అయ్యిందని చెప్పారు. కత్రినా కైఫ్‌ మాట్లాడుతూ తనకు చైన్నె అంటే చాలా ఇష్టం అన్నారు. తన తల్లి కూడా కొంత కాలం మధురైలోని ఒక పాఠశాలలో పనిచేశారని చెప్పారు.

తమిళంలో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్‌
తను ఇప్పటికే దక్షిణాదిలో తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించానని ఇప్పుడు తొలిసారిగా మెర్రీ క్రిస్మస్‌ ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో విజయ్‌సేతుపతితో కలిసి నటించడం ఇంకా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ చిత్రం కోసం ముందుగా తాము రిహార్సల్స్‌ చేశామని చెప్పారు. ఈ సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

చదవండి: హనుమాన్‌, గుంటూరు కారం కాంట్రవర్సీపై చిరంజీవి కామెంట్స్

Advertisement
Advertisement