వందమందికి సాయం

కరోనా కారణంగా దాదాపు ఐదు నెలలుగా అన్ని పరిశ్రమల లాగానే చిత్రపరిశ్రమలో పలువురు చిన్న స్థాయి కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు నిత్యావసరాలు అమ్మే దుకాణం ఆరంభించారు. ఒకరిద్దరు రోడ్లపై పండ్లు అమ్ముకుంటున్నారు. అయితే స్టార్స్ తమకు తోచిన విధంగా సహాయం అందిస్తూనే ఉన్నారు. తాజాగా కథానాయిక కత్రినా కైఫ్ తన వంతు సాయంగా 100మంది డ్యాన్సర్స్‌కి ఆర్థిక సాయాన్ని అందించారు. కూరగాయల షాపులను, టిఫిన్ బండ్లు పెట్టుకునేందుకు వాళ్లకు కత్రినా సాయమందించారు. కొన్నినెలల క్రితం హృతిక్ రోషన్ కూడా వంద మంది డ్యాన్సర్స్‌కు సాయం అందించారు. ఇప్పుడు కత్రినా ముందుకొచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచినందుకు కత్రినాకి డ్యాన్సర్స్ కృతజ్ఞతలు తెలియచేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి