మా సినిమాకు జిమ్మిక్కులు అక్కర్లేదు: బాలీవుడ్‌ హీరో | Kartik Aaryan: Bhool Bhulaiyaa 3 Does not Need Any Gimmicks | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ వార్‌: మా మూవీకి ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదు

Oct 31 2024 6:36 PM | Updated on Oct 31 2024 6:36 PM

Kartik Aaryan: Bhool Bhulaiyaa 3 Does not Need Any Gimmicks

ఈ మధ్య హారర్‌ సినిమాలకు గిరాకీ పెరిగిపోయింది. ఆల్‌రెడీ హిట్‌ అయిన సినిమాలకు సీక్వెల్స్‌ తీసుకొస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో 'భూల్‌ భులయ్యా 3' రానుంది. ఈ ఫ్రాంచైజీలో మొదటిసారిగా 2007లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా భుల్‌ భులయ్యా తెరకెక్కింది. ఈ సినిమా హిట్‌ కావడంతో 2022లో సీక్వెల్‌ తీసుకొచ్చారు. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించాడు. 

సింగం అగైన్‌ Vs భూల్‌ భులయ్యా 3
ఈ చిత్రానికి విశేష స్పందన రావడంతో మూడో భాగం ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఈ మూడో పార్ట్‌లోనూ కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించాడు. తృప్తి డిమ్రి, విద్యా బాలన్‌, మాధురీ దీక్షిత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్‌ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా అజయ్‌ దేవ్‌గణ్‌, దీపికా పదుకొణె, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ కపూర్‌ వంటి బడా స్టార్లు నటించిన 'సింగం అగైన్‌' రిలీజవుతోంది.

 జిమ్మిక్కులు అవసరం లేదు
దీంతో ఈ దీపావళి వార్‌లో ఎవరు గెలుస్తారనేది బాలీవుడ్‌లో ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హీరో కార్తీక్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ.. భూల్‌ భులయ్యా సినిమాలో చాలామంది యాక్టర్స్‌ ఉన్నారు. కాబట్టి మా మూవీకి ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదు. కథపై, సినిమాపై మాకు పూర్తి నమ్మకముంది అని పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement