Karthikeya 2 Theatrical Trailer: Mythology, An Epic And Mystical Adventure of Nikhil - Sakshi
Sakshi News home page

Karthikeya 2 Trailer: అదిరిపోయిన కార్తికేయ-2 ట్రైలర్‌.. నిఖిల్‌కి మరో హిట్టు!

Aug 6 2022 7:28 PM | Updated on Aug 6 2022 7:47 PM

Karthikeya 2 Trailer: An Epic Mystical Adventure of Nikhil - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అనుపమ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్‌ ఈ సినిమా. ఇప్పటికే కార్తికేయ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. శ్రీకృష్ణుడి చరిత్రతో, ద్వారకా నగరి నేపథ్యంతో ట్రైలర్‌ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా ఉంది. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది.. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం'అనే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement