అండమాన్‌లో యాక్షన్‌ | Sakshi
Sakshi News home page

అండమాన్‌లో యాక్షన్‌

Published Fri, May 31 2024 12:11 AM

Karthik Subbaraj Suriya 44 shooting to begin in Andaman

కొద్ది రోజుల పాటు అండమాన్‌కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్‌ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ప్రారంభం కానుంది.

నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్‌’లో ఓ వీడియోను షేర్‌ చేశారు కార్తీక్‌ సుబ్బరాజ్‌. అండమాన్‌లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement