తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి! | Karthi New Movie Meiyazhagan Movie Telugu Version Detials | Sakshi
Sakshi News home page

Sathyam Sundaram: తెలుగు ప్రేక్షకులకు ఇన్నాళ్లకు కాస్త గౌరవం

Sep 13 2024 6:31 PM | Updated on Sep 13 2024 7:20 PM

Karthi New Movie Meiyazhagan Movie Telugu Version Detials

తమిళ దర్శకనిర్మాతలకు తెలుగు ప్రేక్షకులంటే మరీ అలుసు. బయటకు ఆహా ఓహో అని చెబుతారు. కానీ సినిమాల్లో కథ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దానిలోనూ తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమాకు పెట్టే పేరు దగ్గర నుంచి డబ్బింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్లు. కానీ రీసెంట్ టైంలో ఆ పద్ధతి పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తీ తన కొత్త మూవీతో తెలుగు ఆడియెన్స్‌కి కాస్త గౌరవం ఇస్తున్నాడా అనిపిస్తుంది.

రీసెంట్ టైంలో తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనే చాలానే రిలీజయ్యాయి. వీటిలో అయలాన్, బాక్, రాయన్, తంగలాన్ ఉన్నాయి. ఈ టైటిల్‌కి అర్థం ఏంటంటే ఒక్కడూ చెప్పలేడు. తమిళంలో ఏదైతే పెట్టారే దాన్ని యధాతథంగా అనువదించేశారు. ఏ పేరు పెట్టినా తెలుగు ప్రేక్షకుడు చూస్తాడులే అని అలుసు కావొచ్చు. త్వరలో రిలీజయ్యే రజనీకాంత్ 'వేట్టయాన్', సూర్య 'కంగువ' సినిమాలది కూడా ఇదే తీరు.

(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)

ఇకపోతే కార్తీ లేటెస్ట్ తమిళ మూవీ 'మైళగన్'. తమిళనాడులోని తంజావుర్‌లో ఓ రాత్రి ఇద్దరు వ్యక్తులు (బావ-బావమరిది) మధ్య జరిగిన స్టోరీతో దీన్ని తీశారు. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళ పేరుని ఉన్నది ఉన్నట్లు కాకుండా 'సత్యం సుందరం' అని టైటిల్ పెట్టారు. ఉద్దండరాయుని పాలెం ఊరిలో కథని జరిగినట్లు చూపించారు. ఊరి పేర్లతో సహా బండి నంబర్ ప్లేట్ల విషయంలో టీమ్ కాస్త శ్రద్ధ తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి.

అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర' సినిమా రిలీజైన ఒకరోజు తర్వాత అంటే సెప్టెంబరు 28న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీ తీసే సినిమాలు అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంటాయి. అయితే 'దేవర'తో పోటీగా వస్తున్నాడు. ఏం చేస్తాడో చూడాలి? సరే ఇదంతా పక్కనబెడితే తమిళ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇప్పటికైనా కాస్త టైటిల్స్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బెటర్!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement
 
Advertisement
Advertisement