నిర్మాతగా కరిష్మా కపూర్‌

Karisma Kapoor turn producer - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటి కరిష్మా కపూర్‌ పూర్తి స్థాయి సినిమాల్లో కనిపించక సుమారు ఎనిమిదేళ్లు పైనే అవుతోంది. ఇటీవలే ‘మెంటల్‌ హుడ్‌’ వెబ్‌ సిరీస్‌ ద్వారా కమ్‌బ్యాక్‌ ఇచ్చారు కరిష్మా. పిల్లల్ని పెంచడంలో తల్లి కష్టం ఏంటి? వంటి విషయాలను ఈ సిరీస్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం నిర్మాతగా మారాలనే ఆలోచనలో కరిష్మా ఉన్నారట. ముందు వెబ్‌ సిరీస్‌లు, ఆ తర్వాత సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని సమాచారం. కొత్త కొత్త ఐడియాలను తమ బ్యానర్‌ ద్వారా ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నారట. త్వరలోనే మొదటి వెబ్‌ సిరీస్‌ విషయాలను ప్రకటించడానికి కరిష్మా సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top