‘కపట నాటక సూత్రధారి’ మూవీ రివ్యూ

Kapata Nataka Sutradhari Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : కపట నాటక సూత్రధారి
నటీనటులు : విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు
నిర్మాత : మనీష్ (హలీమ్)
దర్శకత్వం : క్రాంతి సైన
సంగీతం : రామ్ తవ్వా
నేపథ్య సంగీతం : వికాస్ బడిస
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
విడుదల తేది : నవంబర్‌ 12, 2021

వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. నవంబర్ 12 న థియేటర్లలో   విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ చూద్దాం.

కథేంటంటే..?
ఒక బస్తీకి చెందిన యాదగిరి(విజయ్ శంకర్ ),  సెంథిల్(సంపత్ కుమార్), పూర్ణ(చందులాల్), పుష్ప(అమీక్ష), కల్పన(సునీత) లు లైఫ్ లో గోల్‌ను అచీప్ కావాలనుకుని ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు.అలాంటి తరుణంలో బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని ఒక వ్యక్తి  చెప్పడంతో ఆ లోన్ అమౌంట్ తో లైఫ్‌లో సెట్‌ అవ్వొచ్చని అప్లై చేస్తారు. అయితే వీరు అప్లై చేసిన బ్యాంకులో ఒక కస్టమర్‌ తను తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకొని వెళితే అది నకిలీ బంగారం అని తేలుతుంది. బ్యాంకు వాళ్లే ఈ మోసానికి పాల్పడుతున్నారని తెలుసుకున్న కస్టమర్స్‌.. ఈ విషయంపై పోలీసుకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణ కోసం సిన్సియర్‌ అండ్‌ సీనియర్‌ పోలీస్ ఆఫీసర్ అరవింద్ (రుద్ర )ని రంగంలోకి దించుతుంది. అరవింద్‌ విచారణ చేపట్టే క్రమంలో బస్తీకి చెందిన ఆ ఐదుగురే 30 ఫెక్ అకౌంట్లను ఓపెన్ చేసి 99 కోట్లు అనగా 200 కేజీల బంగారం స్కాం చేశారని తేలుతుంది. దీంతో పోలీస్ ఆఫీసర్ రుద్ర ఈ బస్తీ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడానికి వెళ్తాడు. ఆ తరువాత రుద్ర చేసే ఇన్వెస్టగేషన్ లో ఈ స్కాం వేరేవాళ్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్ కృష్ణ మూర్తి(భానుచందర్‌)తో పాటు బ్యాంకు ఉద్యోగులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. అసలు ఈ స్కాం ఎవరు చేశారు?ఎందుకు బ్యాంక్ ఎంప్లాయిస్ చనిపోతూ వుంటారు? ఈ స్కామ్ నుంచి ఈ ఐదుగురు బస్తీ వాసులు బయటపడ్డారా.. లేదా..?  ఇంతకూ ఈ స్కాం లో అసలైన "కపట నాటక సూత్ర దారుడెవ్వరు? అనేదే మిగతా కథ.

ఎలా చేశారంటే...?
బస్తీవాసీ యాదగిగిగా విజయ్‌ శంకర్‌ తనదైన నటనతో మెప్పించాడు. సెంథిల్‌ పాత్రలో నటించిన కమెడియన్ శివారెడ్డి తమ్ముడు సంపత్ కుమార్ చక్కటి నటనను కనబరిచాడు. తెలివైన కుర్రాడు పూర్ణగా పాత్రకు చందులాల్‌ న్యాయం చేశాడు.  పూలమ్ముకునే యువతి పుష్ప పాత్రలో అమీక్ష ఒదిగిపోయింది. ట్రాన్స్ జెండర్ కల్పనగా సునీత మెప్పిచింది. పోలీసాఫీసర్‌ రుద్ర పాత్రలో అరవింద్‌ అద్భుత నటనను కనబరిచాడు. ఇన్వెస్టగేషన్ చేసే క్రమంలో తన విశ్వరూపాన్ని చూపించాడు. బ్యాంక్ మేనేజర్ గా బాను ప్రసాద్, మేక రామకృష్ణ, విజయ్,మాస్టర్ బాబా ఆహిల్, రవిప్రకాష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
 సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలు ఎన్ని వచ్చినా సరే.. ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు క్రాంతి సైన ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు. దానికి కొంత ప్రేమను జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రధాన పాత్రల భావోద్వేగాలు, బ్యాక్‌ డ్రాప్‌ సెటప్, పాత్రల ఎలివేషన్స్  బాగున్నాయి. మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు  తీసుకొచ్చిన దర్శకుడు క్రాంతి సైన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక సాంకెతిక విషయానికి వస్తే.. రామ్ తవ్వ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. దొంతి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటర్ చోటా కె.ప్రసాద్ పనితీరు బాగుంది. రామకృష్ణ అందించిన మాటలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top