Kantara Movie To Be Released In Spanish, Italian Language; Check Details Here - Sakshi
Sakshi News home page

Kantara Movie: క్రేజీ న్యూస్‌.. విదేశాల్లోనూ రిలీజ్‌ కానున్న కాంతార

Mar 20 2023 8:45 AM | Updated on Mar 20 2023 9:47 AM

Kantara Movie To Be Released In Spanish, Italian Languages - Sakshi

20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 450 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఈ మూవీని విదేశాల్లో కూడా రి

భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కాంతార’ చిత్రం ఇప్పుడు విదేశీ ఆడియన్స్‌ని అలరించేందుకు సిద్ధం అవుతోంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. సప్తమి గౌడ హీరోయిన్‌. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఇతర భాషల్లో కూడా రిలీజ్‌ చేశారు.

సుమారు 20కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 450 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఈ మూవీని విదేశాల్లో కూడా రిలీజ్‌ చేయాలని చిత్రయూనిట్‌ నిర్ణయించుకుంది. స్పానిష్, ఇటాలియన్‌ భాషల్లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని, థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement